: టీమిండియా కోచ్ ఎవరైతే ఏంటి?...రాజకీయాలు మాత్రం ఉండకూడదు: జెఫ్ ధాంప్సన్
టీమిండియా కోచ్ ఎవరైతే ఏంటని ఆస్ట్రేలియా దిగ్గజం జెఫ్ ధాంప్సన్ ప్రశ్నించాడు. బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, టీమిండియా ప్రస్తుతం మంచి ఫేజ్ లో ఉందని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా ఆధిపత్యం మరికొన్నేళ్లు ఇలాగే కొనసాగుతుందని, అలాంటప్పుడు టీమిండియా కోచ్ ఎవరైతే ఏంటని ఆయన పేర్కొన్నాడు. అయితే కోచ్ ఎవరైనా రాజకీయ ప్రమేయం లేకుండా ఎంపికైతే బాగుంటుందని ఆయన సూచించాడు. కోచ్ నియామకంలో ఏది ప్రభావితం చేస్తుందో తనకు తెలియదని, రాజకీయాలు మాత్రం ప్రభావితం చేయకూడదని ఆయన అభిప్రాయపడ్డాడు. పలు సందర్భాల్లో కోచ్ స్వదేశీయా? విదేశీయా? అంటూ అనవసర చర్చలు లేస్తున్నాయని, అవి ఆరోగ్యకరం కాదని ఆయన అన్నాడు. జట్టు ప్రయోజనాలు కాపాడే వ్యక్తి ఎవరైనా కోచ్ కావచ్చని ఆయన తెలిపారు. టీమిండియా కోచ్ గా ఎవరు వచ్చినా పెద్ద తేడా ఉండదని ఆయన తెలిపారు.