: వ్యక్తిగత ప్రతిష్ట కోసం కులాన్ని వాడుకోవద్దు: ముద్రగడపై బోండా ఉమ విమర్శలు
కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నేపథ్యంలో టీడీపీ నేత బోండా ఉమ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తానెందుకు దీక్షకు దిగాడో ముద్రగడకే తెలియదని ఉమ ఎద్దేవా చేశారు. తామిచ్చిన హామీలపై ప్రభుత్వం కట్టుబడి ఉందని, వాటిని నెరవేర్చే క్రమంలోనే ప్రయత్నాలు కొనసాగిస్తోందని ఆయన పేర్కొన్నారు. డిమాండ్లను నెరవేర్చుకునే క్రమంలో తమకు ఏవైనా సందేహాలుంటే సీఎంతో కాపునేతలు చర్చించవచ్చని ఆయన చెప్పారు. కులం అనే అంశాన్ని వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడం కోసం ఉపయోగించవద్దని బోండా ఉమ వ్యాఖ్యానించారు. ముద్రగడ తన చర్యలతో కాపులకు నష్టం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని ఘటనలో విధ్వంసం సృష్టించిన వారిపై చర్యలు తప్పవని ఆయన అన్నారు.