: కొల్లేరులో టోర్నడో... ఆందోళనలో స్థానికులు!
పశ్చిమగోదావరి జిల్లాలో మరోసారి టోర్నడో తరహా సుడిగాలులు కనిపించి స్థానికులను ఆందోళనకు గురి చేశాయి. ఏలూరు సమీపంలోని కొల్లేరు పరిధిలో నేటి మధ్యాహ్నం భీకరమైన సుడిగాలి లేచింది. కొల్లేటి సరస్సుపై సుమారు 20 నిమిషాల పాటు ఈ సుడిగాలి భీకర రూపం దాల్చడంతో టోర్నడో వచ్చిందేమోనని స్థానికులు ఆందోళన చెందారు. అయితే అది నెమ్మదిగా శాంతించడంతో ఊపిరిపీల్చుకున్నారు. గత నెలలో కూడా ఇలాంటి సుడిగాలి కనిపించడంతో అమెరికాలో సాధారణంగా కనిపించే టోర్నడోలు ఏపీలో కూడా కనిపిస్తాయా? అనే ఆందోళన నెలకొంది.