: పాల్వాయికి షోకాజ్ నోటీసు ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరాం: షబ్బీర్ అలీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరామని ఆ పార్టీ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రమశిక్షణ లేని వాళ్లు ఎంతమంది పార్టీ వీడినా నష్టం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ పాల్వాయి లాంటి వాళ్ల వల్ల అధికారంలోకి రాలేకపోయామని, పెద్ద వాళ్లని మర్యాద ఇస్తుంటే, ఎక్కువ మాట్లాడుతున్నారంటూ షబ్బీర్ అలీ మండిపడ్డారు.