: చంద్రబాబు పేరు ప్రస్తావనతో... మంత్రి జూపల్లి, రేవంత్ రెడ్డి వాగ్వాదం


మంత్రి జూపల్లి కృష్ణారావు, టీడీపీ నేత రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చంద్రబాబు వల్లే పాలమూరుకు నీరు రావటం లేదన్న జూపల్లి వ్యాఖ్యలకు రేవంత్ మండిపడ్డారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలం జోగారంలో జరిగింది. ఇక్కడ జరిగిన ఒక శంకుస్థాపనా కార్యక్రమంలో వాళ్లిద్దరూ పాల్గొన్నారు. చంద్రబాబు ప్రస్తావన ఈ సమావేశంలో తేవద్దంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. దీంతో ఇద్దరు నేతల మధ్య మాటలయుద్ధం జరిగింది. తమ తమ నేతలకు మద్దతుగా టీడీపీ-టీఆర్ఎస్ శ్రేణులు నిలిచాయి.

  • Loading...

More Telugu News