: కాపు రిజర్వేషన్లపై పవన్ కల్యాణ్ స్పష్టమైన వైఖరి తెలపాల్సిందే: వీహెచ్
కాపు రిజర్వేషన్ల అంశంపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలపాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మరోసారి డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం ముద్రగడ చేస్తోన్న పోరాటానికి తన మద్దతు ఉంటుందని వీహెచ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తుని ఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురిని అరెస్టు చేయటం పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమాయకులను అరెస్టు చేసిందని ఆయన ఆరోపించారు. పవన్ కల్యాణ్ ఈ అంశంపై స్పందించాలని ఆయన కోరారు. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం చర్యలను తాము ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.