: సరబ్ జిత్ పై దాడి ఘటనపై ప్రధాని స్పందన


పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారతీయ ఖైదీ సరబ్ జిత్ సింగ్ పై నిన్న తోటి ఖైదీ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తలకు తీవ్రగాయమైన సరబ్ జిత్ ప్రస్తుతం లాహోర్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ స్పందించారు. సరబ్ జిత్ పై దాడి చాలా విచాకరమన్నారు. కాగా, సరబ్ జిత్ కు తొలుత శస్త్రచికిత్స చేద్దామని భావించిన వైద్యులు ఆ ఆలోచన విరమించుకున్నారు. తలలో అంతర్గత రక్తస్రావం ఇంకా ఆగకపోవడంతో వైద్యులు తాజా నిర్ణయం తీసుకున్నారు. సరబ్ జిత్ ఇంకా కోమాలోనే ఉన్నారు.

  • Loading...

More Telugu News