: ముద్రగడ అరెస్ట్ తప్పదు!... వారెంట్లతో కిర్లంపూడి వచ్చిన సీఐడీ పోలీసులు!


కాపులకు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఉద్యమ బాట పట్టిన కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అరెస్ట్ తప్పేలా లేదు. తుని విధ్వంసకారులంటూ అరెస్ట్ చేసిన కాపు యువకులను తక్షణమే విడుదల చేయాలని, కాపులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్న డిమాండ్ తో నేటి ఉదయం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన సొంతింటిలో ఆమరణ దీక్షకు దిగిన ముద్రగడను అరెస్ట్ చేసేందుకు లా అండ్ ఆర్డర్ పోలీసులు రాగా వారికి అక్కడ తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. పోలీసుల తీరుపై స్వయంగా ఆగ్రహం వ్యక్తం చేసిన ముద్రగడ... తనను అరెస్ట్ చేయడానికి లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎవరంటూ విరుచుకుపడ్డారు. తనను అరెస్ట్ చేసేందుకు యత్నిస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఆయన హెచ్చరించారు. తుని ఘటనలో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తేనే తాను అరెస్ట్ అవుతానంటూ చెప్పారు. దీంతో పోలీసు ఉన్నతాధికారుల సూచన మేరకు అరెస్ట్ వారెంట్లు చేతబట్టుకుని సీఐడీ పోలీసులు కిర్లంపూడి చేరుకున్నారు. మరికాసేపట్లోనే వారు ముద్రగడను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News