: ముద్రగడ దీక్ష ఎఫెక్ట్!... కడపలో మీడియా సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిన చంద్రబాబు


తూర్పు గోదావరి జిల్లాలో కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్ష... కడప జిల్లాలో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని టెన్షన్ కు గురి చేసింది. ఓ వైపు ముద్రగడ దీక్ష ప్రారంభించగా... కాపుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపడుతోందని చెప్పడమే కాకుండా ముద్రగడ దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేసేందుకు చంద్రబాబు కడపలో కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియాతో చంద్రబాబు మాట్లాడుతుండగానే... ఆయన వద్దకు వచ్చిన అధికారులు ఆయనకు ఏదో విషయం చెప్పారు. దీంతో మీడియా సమావేశాన్ని మధ్యలోనే ఆపేసిన చంద్రబాబు అక్కడి నుంచి లేచి వెళ్లారు. ముద్రగడ చేతిలో పురుగుల మందు డబ్బా ఉన్న విషయంతో పాటు తనను అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్న పోలీసులను ముద్రగడ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారన్న విషయం తెలియడంతోనే చంద్రబాబు ఒకింత టెన్షన్ కు గురై మీడియా సమావేశం నుంచి లేచి వెళ్లినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News