: ముద్రగడ దీక్ష చేయడం మంచిది కాదు: చంద్రబాబు ఆగ్రహం
తుని ఘటనలో కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కిర్లంపూడిలో కాపునేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షకు దిగడం మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో మరిన్ని సమస్యలు సృష్టించవద్దని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చే క్రమంలోనే తాము కమిషన్ వేశామని ఆయన అన్నారు. తుని ఘటనలో బయటి శక్తులు పాల్గొన్నాయని ఆయన అన్నారు. కాపుల డిమాండ్ల పట్ల తాము చిత్తశుద్ధితోనే ఉన్నామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత తమకు ఉందని ఆయన అన్నారు. కాపుల డిమాండ్లను పరిష్కరిస్తూనే ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు.