: అమెరికాలో బిజీబిజీగా బాలయ్య!... అంతర్జాతీయ బయో సదస్సులో ఏపీ పెవిలియన్ కు ప్రారంభోత్సవం!


టాలీవుడ్ అగ్ర నటుడు, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నారు. తన తల్లి పేరిట హైదరాబాదులో ఏర్పాటైన బసవతారకం కేన్సర్ ఆసుపత్రి విస్తరణకు నిధుల సేకరణ కోసం తన సతీమణి వసుంధరతో కలిసి అమెరికా వెళ్లిన బాలయ్యకు అక్కడ ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. సొంత పని మీదే వెళ్లిన బాలయ్య నిన్న ఏపీ ప్రభుత్వం తరఫున ఓ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. నిన్న శాన్ ఫ్రాన్సిస్కోలో అంతర్జాతీయ బయో సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు దాదాపుగా 65 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ఈ సదస్సులో ఏపీ ప్రభుత్వం తన పెవిలియన్ ను ఏర్పాటు చేసింది. ఈ పెవిలియన్ ను బాలయ్య నిన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య సతీమణి వసుంధరతో పాటు భారత ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా, ఏపీ ఎకనమిక్ డెవలెప్ మెంట్ బోర్డు సీఈఓ కృష్ణ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News