: డోపింగ్ టెస్టులో దొరికిపోయిన షరపోవాపై రెండేళ్ల నిషేధం!


డోపింగ్ టెస్టులో దొరికిపోయిన టెన్సిస్ స్టార్ మారియా షరపోవాపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య రెండేళ్ల నిషేధం విధించింది. ఐదు సార్లు గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచిన షరపోవా ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా నిర్వహించిన డోప్ టెస్టులో విఫలమైంది. ఈ పరీక్షలో నిషేధిత డ్రగ్ మెల్డోనియం వాడుతున్నట్టు నిర్ధారణ అయింది. అయితే తనకు దానిని నిషేధించినట్టు తెలియదని, 2006 నుంచి దానిని వాడుతున్నానని, ఈ ఏడాదే దానిని నిషేధించినట్టు తెలిసిందని షరపోవా ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ యాంటీ డోపింగ్ కమిషన్ కు తెలిపింది. దీంతో ఆమె తప్పిదానికి జీవితకాల నిషేధం విధించాల్సి ఉండగా, తెలియకుండా చేసిన తప్పుగా భావించి, కేవలం రెండేళ్ల నిషేధంతో టెన్నిస్ ఫెడరేషన్ సరిపెట్టడం విశేషం.

  • Loading...

More Telugu News