: ఒంగోలు రిమ్స్ ప్రొఫెసర్ పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన విద్యార్థినులు.. అరెస్ట్
ప్రొఫెసర్ వేధింపులు తాళలేకపోయిన వైద్య విద్యార్థినులు ఆ కామాంధుడి ఆటకట్టించిన ఘటన ఒంగోలులో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు రిమ్స్ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బంకా రత్నం (35) కాలేజ్ లో విద్యనభ్యసిస్తున్న వైద్య విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్నాడు. వైద్యవిద్యలో ప్రాక్టికల్స్ ఉండడంతో కొంతకాలం మౌనంగా భరించిన విద్యార్థినులు, అతని వేధింపులు పెరుగుతుండడంతో ఆగలేకపోయారు. దీంతో బాధిత విద్యార్థినులు జిల్లా ఎస్పీ త్రివిక్రమ్ వర్మను కలిశారు. ఈ సందర్భంగా తమకు వేధింపుల ప్రొఫెసర్ నుంచి రక్షణ కావాలని కోరారు. అతని వేధింపులు భరించలేకపోతున్నామని చెప్పారు. దీంతో వెంటనే ఆయనను అరెస్టు చేయాలని ఆదేశించడంతో, అధికారులు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.