: మహానందిలో సినీనటి జయప్రద ప్రత్యేక పూజలు
కర్నూల్ జిల్లాలోని పుణ్యక్షేత్రం మహానందికి సినీ నటి జయప్రద ఈరోజు వెళ్లారు. శ్రీకామేశ్వరి సహిత మహానందీశ్వరుడిని దర్శించుకున్న ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజ, స్వామివారికి అభిషేకం చేశారు. మహానంది ఆలయ చరిత్ర, అక్కడి కోనేరు ప్రాశస్త్యం గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. జయప్రదను చూసేందుకు అక్కడి భక్తులు ఎగబడ్డారు.