: ఈరోజు మనం మహా సంకల్పం చేస్తే... వాళ్లు నా మీద పోలీసులకు కంప్లెయింట్ ఇస్తారా?: సీఎం చంద్రబాబు


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు పరోక్షంగా మండిపడ్డారు. కడపలో మహాసంకల్ప దీక్షలో ఆయన మాట్లాడుతూ,‘ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని ఇబ్బందిపెట్టాలని, నేను ఫెయిల్ అయితే, ఈయన సక్సెస్ అయినట్లు... ఒక పవిత్రమైన భావనతో ఈరోజు మనం మహా సంకల్పం చేస్తే... నా మీద పోలీసులకు కంప్లెయింట్ ఇస్తారా? అంటే, ఎంత చౌకబారు రాజకీయాలు!.. తమ్ముళ్లు, ఆడబిడ్డలు అందరూ ఆలోచించాలి. కష్టాల్లో ఉన్నాం, ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాం, అందరూ సహకరించండి, ముందుకు పోదామని ప్రజలందరినీ కోరుకుంటున్నాను’ అంటూ చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు.

  • Loading...

More Telugu News