: అమెరికాలో రెండు విమానాలు ఢీ...పైలట్లు సేఫ్
అమెరికాలో రెండు విమానాలు ఢీ కొట్టాయి. జార్జియాలో రెండు ఎఫ్-16 జెట్ ఫైటర్లు ఎదురెదురుగా వస్తూ ఢీ కొన్నాయి. దక్షిణ కరోలినాకు చెందిన ఎయిర్ నేషనల్ గార్డ్ జెట్ (ఎన్ఏజీ) ఫైటర్లు గత రాత్రి 9గంటల సమయంలో హడ్సన్ లోని టౌన్ సెండ్ రేంజ్ ప్రాంతంలో ఫ్లైయింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తుండగా సాంకేతిక (కమ్యూనికేషన్) లోపం కారణంగా పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా విమానాలు ఢీ కొట్టడంతో అవి కూలిపోయాయి. అప్రమత్తమైన పైలట్లు ఎజెక్ట్ బటన్ ఉపయోగించి ప్రాణాలతో బయటపడ్డారు. వారిని హుటాహుటీన స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.