: వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే అభ్యసించాలి... నిరాహార దీక్షకు దిగిన సందీప్ పాండే
ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు రాబట్టాలంటే ప్రభుత్వాధికారులు, రాజకీయనాయకుల పిల్లలు ఆ బడుల్లోనే చదువుకోవాలని గత ఏడాది ఆగస్టు 18న అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం విదితమే. ఈ తీర్పుతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన పద్ధతుల్లో మార్పులు వస్తాయని, వసతులు మెరుగుపడతాయని భావించారు. అయితే, ఈ తీర్పును పాటించిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ అంశంపై సామాజిక కార్యకర్త సందీప్ పాండే అలహాబాద్ లో నిరవధిక నిరశనకు దిగారు. ఆ తీర్పును అమల్లోకి తెచ్చేంతవరకు తాను నిరశనను విరమించబోనని చెప్పారు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.