: మావోయిస్టు నేత సవ్యసాచి పాండాకు సీఎం 45 లక్షలు పంపారు: ఒడిశా సీఎంపై కేంద్ర మాజీ మంత్రి సంచలన ఆరోపణలు


మావోయిస్టు నేత సవ్యసాచి పాండా ఖాతాకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 45 లక్షల రూపాయలు బదిలీ చేశారని కేంద్ర మాజీ మంత్రి బ్రజా కిశోర్ త్రిపాఠీ ఆరోపించారు. భువనేశ్వర్ లో ఆయన మాట్లాడుతూ, మావోయిస్టులకు ముఖ్యమంత్రితో సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణ చేశారు. ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాల కోసం మావోయిస్టులను నవీన్ పట్నాయక్ వాడుకున్నారని ఆయన తెలిపారు. బిజు జనతా దల్ (బీజేడీ) ఎస్బీఐ అకౌంట్ (10091755246) నుంచి పాండా ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్ (203601501728) కు చెక్కు రూపంలో (441630) 45 లక్షల రూపాయలను చెల్లించారని ఆయన తెలిపారు. బీజేడీ అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేరుతో 2014, ఏప్రిల్ లో ఈ మొత్తాన్ని బదిలీ చేశారని ఆయన చెప్పారు. మావోయిస్టులకు ఆర్థిక సాయం చేస్తూ, మావోలపై పోరుకు కేంద్రం నుంచి నిధులు కావాలని కోరడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం బదిలీ కావడానికి ముందు రోజు పాండా అకౌంట్ నుంచి బీజేడీ అకౌంట్ లోకి లక్ష రూపాయలు బదిలీ అయ్యాయని ఆయన తెలిపారు. అంతే కాకుండా 2014లో బీజేడీ నేతకు సంబంధించిన ఖాతా నుంచి పాండా ఖాతాకు 5 లక్షల రూపాయలు బదిలీ అయ్యాయని ఆయన తెలిపారు. అంటే మావోయిస్టులకు బీజేడీ నుంచి ఆర్ధిక సాయం, అండదండలు అందుతున్నాయని స్పష్టంగా అర్థమవుతోందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News