: రాష్ట్రం కోసం ఎలాంటి కష్టానికైనా సిద్ధం: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధంగా ఉన్నాయని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. కడపలో జరిగిన మహాసంకల్పదీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమైక్యాంధ్ర ఉద్యమం నాటి నుంచి ఉద్యోగ సంఘాలు రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నాయని అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులు రధచక్రాలుగా ఉంటారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నడిచేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. కష్టాలు ఎదురైనా అమరావతికి తరలేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఇలాగే ఐదేళ్లపాటు కష్టపడితే రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఆయన చెప్పారు. కష్టనష్టాలకోర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటన నడిపేందుకు ఉద్యోగులు చిత్తుశుద్ధితో పని చేస్తారని ఆయన తెలిపారు.