: అసభ్యకర ఫోటోలు పంపుతున్నాడు.. నటుడు ఏజాజ్‌ ఖాన్ పై కేసు నమోదు


అసభ్యకర ఫోటోలు పంపుతున్నాడన్న ఆరోప‌ణ‌ల‌పై ప్రముఖ బాలీవుడ్ నటుడు ఏజాజ్‌ ఖాన్ పై కేసు న‌మోద‌యింది. త‌న‌కు ఏజాజ్ ఖాన్ అస‌భ్య‌క‌ర ఫోటోలు పంపుతున్నాడంటూ ఐశ్వర్య చౌబే అనే మోడల్ చేసిన ఫిర్యాదుతో ముంబయిలోని వ‌ర్సోవా పోలీసులు కేసు న‌మోదు చేసి, ఏజాజ్‌ ఖాన్‌కి స‌మ‌న్లు జారీ చేశారు. ఏజాజ్‌ ఖాన్ త‌న‌కు పంపిన ఫోటోని తాను డిలేట్ చేశాన‌ని ఐశ్వర్య చౌబే చెప్పింది. అయితే, న‌టుడిపై తాను ఫిర్యాదు చేస్తోంది త‌న ప‌బ్లిసిటీ కోసం కాద‌ని ఆమె పోలీసుల‌కి తెలిపింది. కాగా, ఏజాజ్ ఖాన్ ఆమధ్య 'దూకుడు' తెలుగు సినిమాలో నటించాడు.

  • Loading...

More Telugu News