: భర్తకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్న తమిళ టీవీ నటి లొంగుబాటు
భర్తకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్న తమిళ టీవీ నటి శుభశ్రీ చెన్నయ్ లోని ఎగ్మూరు కోర్టులో లొంగిపోయింది. 'సొంధంబంధం' టీవీ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శుభశ్రీ 2007 మన్నార్ గుడికి చెందిన శరవణన్ (ఇంజనీర్) ను వివాహం చేసుకుంది. వీరికి 8 ఏళ్ల కుమార్తె ఉంది. కాగా, శుభశ్రీ తాజాగా మాధవరంకు చెందిన శ్రీనివాసన్ అనే యువకుడిని వివాహం చేసుకుంది. వీరి వివాహం విషయం తెలుసుకున్న శరవణన్ ఎగ్మూరు కోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో విచారణకు హాజరుకావాలని న్యాయమూర్తి శుభశ్రీని ఆదేశించారు. న్యాయస్థానం ఆదేశాలు పట్టించుకోకపోవడంతో న్యాయమూర్తి అరెస్టు వారెంట్ జారీ చేశారు. దీంతో ఆమె న్యాయస్థానంలో లొంగిపోయింది. అనంతరం జూలై 5న జరగనున్న తదుపరి విచారణకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆమెను ఆదేశించారు.