: తెలంగాణ సమాజంలో మంచి జరిగేందుకు ఎన్ని కోట్లైనా ఖర్చు చేసేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారు: తలసాని


బంగారు తెలంగాణ అంటే బంగారం తెచ్చి ఇవ్వడం కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అన్నది కేవలం ప్రముఖుల మాత్రమే రాలేదని, రాష్ట్రంలోని బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల కోసం తెలంగాణ వచ్చిందని చెప్పారు. బంగారు తెలంగాణ అంటే బాగా బతకడమేనని ఆయన చెప్పారు. హాస్టళ్లలో దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం పెట్టడానికి 700 కోట్లు ఖర్చవుతున్నా, తమ బిడ్డలు మంచి భోజనం చేయాలన్న ఆకాంక్షతోనే సీఎం దానికి వెనకాడలేదని ఆయన తెలిపారు. కుల సంఘాల నాయకులమని చెప్పుకునే నేతలు 15 రోజులకోసారి 5 గ్రామాలు తిరగాలని, వారికి సంబంధించిన కులాల ప్రజలు ఏం చేస్తున్నారో అడిగి తెలుసుకోవాలని ఆయన సూచించారు. అలాగే షాదీముబారక్, కల్యాణలక్ష్మీ, మిషన్ కాకతీయ, వాటర్‌ గ్రిడ్ ఆంధ్రపాలకుల కాలంలో ఉన్నాయా సభికులను ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ విషయాన్ని డబ్బుతో ముడిపెట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సమాజంలో మంచి జరిగేందుకు ఎన్ని కోట్లైనా ఖర్చు చేసేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News