: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న 'ముద్దు' సీను మేకింగ్ వీడియో
సినిమాల్లో సాంగ్ మేకింగ్ వీడియోలు, క్లైమాక్స్ సీన్ మేకింగ్ వీడియోలు విడుదల చేసి, ఆయా సినిమాలకు దర్శకులు హైప్ తీసుకొస్తుంటారు. 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో కీలక పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో షాలినితో కలసి నటిస్తున్న సినిమా 'అర్జున్ రెడ్డి'. ఈ సినిమాలో ముద్దు సీనుకు సంబంధించిన మేకింగ్ వీడియోను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఘాటైన ముద్దు ఎలా పెట్టుకుంటే అందంగా ఉంటుంది, ఎలా పెట్టుకుంటే అభిమానులను అలరిస్తుందనే విషయాలను దర్శకుడు చెబుతుంటే... ముద్దును హీరో, హీరోయిన్లు ప్రాక్టీస్ చేశారు. ఈ వీడియోను యూనిట్ విడుదల చేయగా సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.