: వాగ్దానాలిచ్చి ప్రజలను మోసం చేశారు.. చంద్రబాబుపై పోలీసులకి వైసీపీ ఎంపీ ఫిర్యాదు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్ల రాష్ట్రపాలనపై నిన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు మరో వైసీపీ నేత చంద్రబాబు పాలనపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. పాలనలో రెండేళ్లు గడిచినా చంద్రబాబు తాను ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు కడపలోని పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలువురు కార్యకర్తలతో పోలీస్ స్టేషన్కి వచ్చిన ఆయన పోలీసులకి తమ ఫిర్యాదు లేఖను అందించారు. ఎన్నో హామీలు గుప్పించి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆయన తెలిపారు. చంద్రబాబుని అరెస్టు చేయాలని ఆయన పోలీసులని కోరారు.