: క‌డపలో వర్షం... నేటి ‘మహాసంకల్ప దీక్ష’ ప్రాంగణంలోకి వర్షపునీరు!


క‌డ‌ప జిల్లాలో నేడు మహాసంకల్ప యాత్ర నిర్వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశానికి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు, టీడీపీ యువ‌నేత‌ లోకేష్ హాజ‌రుకానున్నారు. అయితే క‌డప జిల్లాను భారీ వ‌ర్షం ముంచెత్తుతోంది. కడప జిల్లాలో కురుస్తోన్న వ‌ర్షం వ‌ల్ల దీక్ష జ‌రిగే ప్రాంగణంలో వర్షపు నీరు చేరింది. నవ నిర్మాణదీక్ష ముగింపు కార్యక్రమానికి క‌డ‌ప జిల్లా సన్నద్ధమవుతోన్న వేళ ఈరోజు భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో అక్క‌డికి చేరుకోనున్న‌ టీడీపీ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈరోజు సాయంత్రం 4.15 గంటల నుంచి 6 వరకు కడప మునిసిపల్‌ మైదానంలో జ‌ర‌గ‌నున్న బహిరంగ సభలో చంద్ర‌బాబు నాయుడు మాట్లాడ‌నున్నారు.

  • Loading...

More Telugu News