: ‘మొహెంజొదారో’ ఫస్ట్ లుక్ విడుదల.. రఫ్ లుక్‌తో కనిపిస్తోన్న హృతిక్
అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో బాలీవుడ్లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘మొహెంజొదారో’. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని హృతిక్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశాడు. ఇందులో హృతిక్ రోషన్ రఫ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ప్రేమకు, శక్తికి ప్రతిరూపం ‘సార్మాన్’.. అని సినిమాలో తన పాత్ర స్వభావాన్ని తన ట్వీట్ ద్వారా తెలిపాడు హృతిక్ రోషన్. ఈ సినిమాకి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్నందిస్తున్నాడు. ఆగస్టు 12వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.