: వైసీపీ నిరసనలు షురూ!... పులివెందుల పీఎస్ లో చంద్రబాబుపై ఫిర్యాదు!
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన వైఫల్యాలపై నిరసనలు తెలిపేందుకు వైసీపీ చేపట్టిన ఆందోళనలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టనున్న వైసీపీ నేతలు ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఇచ్చిన హామీలను మరిచారని ఆరోపిస్తూ చంద్రబాబుపై ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతూరు పులివెందులలో ఆయన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి, సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిల నేతృత్వంలో భారీ ర్యాలీ జరుగుతోంది. ర్యాలీకి ముందుగానే పోలీస్ స్టేషన్ చేరుకున్న వివేకా, అవినాశ్ లు... చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు.