: ఆ ‘లుంగీ గర్ల్స్’ మహేశ్ బాబు ఫ్యాన్సట!... ‘శ్రీమంతుడు’ను అనుకరిస్తూ అమెరికాలో ఫొటో షూట్!


కేరళ కాలేజీలో జీన్స్ నిషేధాన్ని నిరసిస్తూ కొంతమంది అమ్మాయిలు లుంగీలు కట్టి వరుసగా నిల్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే అమ్మాయిలు లుంగీలు కట్టిన సదరు ఫొటో నిజమైనదేనని, అయితే వారు లుంగీలు కట్టిన కారణం మాత్రం వేరేదని తాజాగా తేలింది. అసలు వారు లుంగీలు కట్టిన ఫొటో తీసుకున్న ప్రదేశం కేరళ కాదని, అమెరికా అని కూడా ముంబైకి చెందిన ప్రముఖ పత్రిక ‘మిడ్ డే’ నిన్న ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది. ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఈ ఫొటో వైరల్ గా మారింది. దీనిపై కాస్తంత లోతుగా పరిశీలన చేసిన మీదటే ‘మిడ్ డే’ పత్రిక తాజా కథరాన్ని రాసింది. సదరు ఫొటోలో కనిపిస్తున్న ‘లుంగీ’ అమ్మాయిలంతా టాలీవుడ్ హీరో మహేశ్ బాబు ఫ్యాన్సట. 2015లో తెలుగు నాట హిట్ చిత్రంగా నిలిచిన మహేశ్ బాబు సినిమా ‘శ్రీమంతుడు’లో హరో లుంగీ కట్టిన వైనాన్ని అనుకరిస్తూ ఆ అమ్మాయిలంతా లుంగీలు కట్టి ఫొటో తీసుకున్నారట. ఇక ఈ ఫొటోలో లుంగీల్లో మగరాయుళ్లలా ఠీవీ ఒలకబోస్తున్న అమ్మాయిలు కేరళకు చెందినవారా? కాదా? అన్న విషయం మాత్రం ఇంకా రూడీ కాలేదని ‘మిడ్ డే’ తన కథనంలో పేర్కొంది.

  • Loading...

More Telugu News