: ఒక్క ఈ-మెయిల్ ఇవ్వండి!... కబ్జాకోరుల తాట తీస్తాం!: దేశ ప్రజలకు అమిత్ షా పిలుపు
మీ భూమిపై కబ్జాకోరుల కళ్లు పడ్డాయా? ఇప్పటికే మీ భూమి భూ బకాసురుల చేతుల్లోకి వెళ్లిపోయిందా?... ఇకపై ఎంతమాత్రం ఆవేదన చెందాల్సిన పనిలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు సింగిల్ ఈ-మెయిల్ పంపితే... మన సమస్య ఇట్టే తీరిపోతుంది. కబ్జాకోరులు మన భూమిని మన చేతుల్లో పెట్టి ఇచ్చేస్తారు. ఉత్తరప్రదేశ్ లోని మధురలో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో నిన్న ప్రముఖ ఆంగ్ల ఛానల్ ‘ఎన్డీటీవీ’తో మాట్లాడిన సందర్భంగా అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా భూకబ్జాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు రేపు (నేడు) ఓ ఈ-మెయిల్ ఐడీని విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ఈ-మెయిల్ కు సింగిల్ మెసేజ్ చేస్తే చాలు... ఆ సమస్య పరిష్కార బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.