: పోలీసుల చక్రబంధంలో కడప!... నేడే ‘మహా సంకల్ప’ దీక్ష!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా ఆఖరి రోజైన నేడు ఏపీ ప్రభుత్వం ‘మహా సంకల్ప’ దీక్షను చేపట్టనుంది. ఈ దీక్షా వేదికను తొలుత ప్రకాశం జిల్లా ఒంగోలుగా ప్రకటించినా... సీఎం నారా చంద్రబాబునాయుడిపై జగన్ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం వేదికను కడపకు మార్చిన సంగతి తెలిసిందే. మహా సంకల్ప దీక్షకు సీఎం చంద్రబాబు సహా కేబినెట్ మంత్రులంతా హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 20 మంది ఎస్పీల నేతృత్వంలో 5 వేల మంది పోలీసులు కడప నగరంలో వాలిపోయారు. వెరసి దాదాపుగా కడప నగరం పోలీసుల చక్రబంధంలోకి వెళ్లిపోయింది.