: కాపు గర్జన నాటి 'రైలు దహనం' నిందితులకు 21 రోజుల రిమాండ్
గత ఫిబ్రవరిలో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని కొబ్బరితోటలో నిర్వహించిన కాపు గర్జన సందర్భంగా రైలు దహనం కేసులో అరెస్టైన ఏడుగురు నిందితులకు 21 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారిని వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఘటనలో ప్రమేయం ఉందంటూ ఏపీ సీఐడీ అధికారులు దూడల ఫణీంద్ర, దొరబాబు, లక్కింశెట్టి శివ, పవన్ కుమార్ తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.