: ముద్రగడ దీక్ష ఎవరి కోసం?: గంటా ప్రశ్న


కాపు ఐక్య ఉద్యమ వేదిక నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ దీక్ష ఎవరికోసం చేపడతామంటున్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, ముద్రగడ దీక్ష రైలును దహనం చేసిన దుండగుల కోసమా? లేక పోలీసు స్టేషన్ పై దాడికి దిగిన దోషుల కోసమా? అని అడిగారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారు నిర్దోషులైతే... మరి ఈ ఘటనల్లో దోషులెవరో ముద్రగడ పద్మనాభం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముద్రగడ వ్యవహారశైలి సరిగా లేదని, దోషులకు కొమ్ముకాయడం సరికాదని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News