: ఒబామాతో మోదీ భేటీ... సుదీర్ఘ చర్చలు
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వైట్ హౌస్ లో ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. ఒబామాతో జరిగిన భేటీతో ఎన్.ఎస్.జి(న్యూక్లియర్ సప్లైయర్స్ గ్రూప్)లో సభ్యత్వం పొందేందుకు భారత్ కు ఉన్న అడ్డంకి తొలగినట్టు తెలుస్తోంది.