: చంద్రబాబుపై హత్య కేసు ఎందుకు పెట్టరు?: ముద్రగడ పద్మనాభం


ఇటీవల జరిగిన గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు పోవడానికి ఏపీ సీఎం చంద్రబాబే కారకుడని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అంతమంది మృతికి కారకుడైన చంద్రబాబుపై హత్య కేసు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. విధ్వంసాలు సృష్టించడం, మోసాలు చేయడం వంటివి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని తీవ్ర విమర్శలు చేశారు.

  • Loading...

More Telugu News