: స్మార్ట్ సిటీ నిధులు కేవలం ఓ భవన నిర్మాణానికి మాత్రమే సరిపోతాయి!: మమతా బెనర్జీ


స్మార్ట్ సిటీల పేరుతో ఏడాదికి కేంద్రం ఇస్తామంటున్న నిధులతో ఓ భవనం నిర్మించొచ్చు కానీ, ఓ పట్టణాన్ని అత్యత్తమంగా తీర్చిదిద్దడం ఎలా సాధ్యమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. కోల్ కతాలో ఆమె మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ సిటీ పథకం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. ఈ పథకంలో భాగంగా కేంద్రం ఒక్కో పట్టణాభివృద్ధికి ఏడాదికి 100 కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లపాటు 500 కోట్ల రూపాయలు ఖర్చుచేయనున్న సంగతి తెలిసిందే. కేంద్రం ఏడాదికి కేటాయించే నిధులు అన్ని సౌకర్యాలు కలిగిన ఓ భవనం నిర్మించడానికి మాత్రమే సరిపోతాయని ఆమె చెప్పారు. అసలు స్మార్ట్ సిటీల ఆలోచనే తప్పని ఆమె తెలిపారు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పవద్దని, రాజకీయ కారణాలతో అభివృద్ధిని ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News