: ఆ కళ్లు ఏం చెబుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయండి: షారూక్ ఖాన్


బాలీవుడ్ అగ్రహీరో షారూక్ ఖాన్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక బ్లాక్ అండ్ వైట్ కొలేజ్ ను పోస్ట్ చేశారు. ఆ కొలేజ్ లో తండ్రి తాజ్ మహ్మద్ ఖాన్, షారూక్ ఖాన్, ఇద్దరు కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఉన్నారు. ఈ ఫొటోను పోస్ట్ చేయడంతో పాటు ‘భావాలతో నిండిపోయిన ఆ కళ్లు ... ఏమి చెబుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయండి...’ అనే ఒక క్యాప్షన్ కూడా షారూక్ రాశాడు. కాగా, ఎస్ఆర్కే బ్లాక్ అండ్ వైట్ పేరుతో ట్విట్టర్ లో ఉన్న ఆయన అభిమానులు తాము ఎడిట్ చేసిన ఫొటోను షారూక్ షేర్ చేయడంపై వారు ధన్యవాదాలు తెలిపారు. దీనికి స్పందించిన షారూక్ ‘ఇది నాకు చాలా ప్రత్యేకం’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News