: బీజేపీ దేశానికి మాట్లాడే ప్రధానినిచ్చింది...అది చాలదా?: అమిత్ షా కౌంటర్
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో బీజేపీ ఏం చేసిందంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నకు... 'దేశానికి మాట్లాడే ప్రధానిని ఇచ్చింది. అది చాలదా?' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లోని కస్ గంజ్ లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, యూపీఏ పాలనలో ప్రధాని మాటను సోనియా, రాహుల్ మినహా ఎవరూ వినలేకపోయారని అన్నారు. తాము అలా కాదని ఆయన చెప్పారు. యూపీలో గడచిన నాలుగేళ్లలో సమాజ్ వాదీ పార్టీ ఏం చేసిందని ఆయన నిలదీశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. యూపీలో తాము అధికారంలోకి వస్తే...విద్యుత్ కోతలు లేకుండా 24 గంటల నిరంతరాయ విద్యుత్ అందజేస్తామని ఆయన చెప్పారు.