: తెలంగాణలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఉచిత ప్రయాణంలో మార్పులు
తెలంగాణలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు అంతకుముందు కేవలం ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశమే ఉండేది. ఆర్టీసీ యాజమాన్యం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించిన సదుపాయాలు మరింత మెరుగుపరిచింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీనిని అనుసరించి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగ దంపతులు డీలక్స్ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. వారి జీవితాంతం ఈ సౌకర్యం ఉంటుంది. రిటైర్డ్ ఉద్యోగి మరణిస్తే కనుక వారి భాగస్వామికి జీవితాంతం ఈ వెసులుబాటు వర్తిస్తుంది. సర్వీసులో ఉన్న ఉద్యోగులు మరణిస్తే కనుక వారి జీవిత భాగస్వామికి అన్ని రకాల సిటీ సర్వీసుల్లో కూడా ఈ వెసులుబాటు లభిస్తుందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.