: ఐసీసీ దమననీతిపై మండిపడ్డ మెక్ కల్లమ్
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పై న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐసీసీ అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవినీతిని రూపుమాపాల్సిన దిశగా చర్యలు తీసుకోవాల్సిన ఐసీసీ అవినీతిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోందని మండిపడ్డాడు. న్యూజిలాండ్ క్రికెట్ లో అవినీతికి పాల్పడిన లూ విన్సెంట్ పై జీవితకాల నిషేధం విధించిన ఐసీసీ, క్రిస్ కెయిన్స్ కు జీవితకాల నిషేధం నుంచి ఎందుకు మినహాయింపు ఇచ్చిందని ప్రశ్నించాడు. అవినీతికి పాల్పడిన ఆటగాళ్లపై పారదర్శకమైన చర్యలుండాలని మెక్ కల్లమ్ సూచించాడు. వ్యక్తి పేరు ప్రతిప్రతిష్ఠలను ఆధారం చేసుకుని చర్యలు ఉండకూడదని ఆయన స్పష్టం చేశాడు.