: గ్లోబల్ ఆసుపత్రి ముందు బైఠాయించిన వీహెచ్... 'ఎత్తు' పెంచుతానన్న డాక్టర్ అరెస్టుకు డిమాండ్!
హైదరాబాదులోని గ్లోబల్ ఆసుపత్రి ముందు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ బైఠాయించారు. నిఖిల్ రెడ్డి ఎత్తు పెంచుతామని, మూడురోజుల్లో లేచి నడుస్తాడని మోసపూరిత ప్రమాణాలు చేసి, ఆపరేషన్ చేసి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు చేసిన ఆపరేషన్ తప్పుడు ఆపరేషన్ అని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్లు ఇచ్చాయని ఆయన తెలిపారు. అధికారుల ఆదేశాల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, సదరు డాక్టర్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయన తెలిపారు. నిఖిల్ రెడ్డి బాధతో విలవిల్లాడుతున్నాడని, అతని భవిష్యత్ ను వైద్యులు నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. పోలీసులు డాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తూ బైఠాయించారు.