: ఇద్దరూ హత్య కేసు నిందితులు...తుని ఘటన నిందితుల వివరాలు వెల్లడించిన సీఐడీ


తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో క్షణక్షణానికి ఉద్రిక్తత చోటుచేసుకుంటుండడంతో అరెస్టు చేసిన వారి కేసుల వివరాలను ఏపీ సీఐడీ పోలీసులు వెల్లడించారు. దూడల ఫణీంద్ర రౌడీ షీటర్ అని అధికారులు తెలిపారు. 2015లో అమలాపురంలో జరిగిన ఓ హత్య కేసులో అతను నిందితుడని అన్నారు. అలాగే దొరబాబు 2012లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడని, 2009లో అధికారులపై దాడి కేసులో నిందితుడని చెప్పారు. గుంటూరుకు చెందిన లక్కింశెట్టి శివ, పవన్ కుమార్ లు తుని ఘటనలో ఓ మీడియా ప్రతినిధి నుంచి సెల్ ఫోన్ లాక్కున్నారని తెలిపారు. అతని నుంచి సెల్ ఫోన్ రికవరీ చేశామని, వీరంతా తుని ఘటనలో పాల్గొన్నట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News