: ఆంధ్రాకు వర్ష సూచన... వచ్చే 48 గంటల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు
వచ్చే 48 గంటల్లో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు ప్రకటించారు. క్యుములో నింబస్ మేఘాల ప్రభావం వల్లే వర్షాలు పడుతున్నాయని, తాజా వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.