: మరో దెబ్బ.. తృణ‌మూల్ కాంగ్రెస్‌లోకి జంప్ అయిన ఆరుగురు త్రిపుర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు


ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో పుదుచ్చేరి మిన‌హా అన్ని రాష్ట్రాల్లోనూ ప‌రాజ‌యాన్నే మూట‌గ‌ట్టుకుంటోన్న కాంగ్రెస్‌కి తాజాగా త్రిపుర నేత‌ల‌నుంచి మ‌రో షాక్ త‌గిలింది. త్రిపురలో కీల‌క కాంగ్రెస్ నేత‌లైన‌ సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ కుమార్ సహ, దిలీప్ సర్కార్, పరంజిత్ సింగ్హా రాయ్, దేబ చంద్ర హ్రంగ్‌ఖ్వాల్, బిస్వ బంధు సేన్ త‌మ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలిపారు. త్రిపుర‌లో మాణిక్ స‌ర్కార్ ముఖ్య‌మంత్రిగా సీపీఎం పార్టీ అధికారంలో ఉన్న విష‌యం తెలిసిందే. కాంగ్రెస్‌కి రాజీనామా చేసి తృణ‌మూల్ కాంగ్రెస్‌లో చేరి తాము సీపీఎం ప్ర‌భుత్వాన్ని స‌వాలు చేయ‌నున్న‌ట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో ఇక‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా తృణ‌మూల్ కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రించ‌నుంది. తాము టీఎంసీలో చేరుతున్న‌ట్లు, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్ర‌కారమే తాము పార్టీ మారుతున్న‌ట్లు స్పీక‌ర్ కి రాసిన లేఖ‌లో స‌ద‌రు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News