: 'కబాలి' ఆడియో వేడుక క్యాన్సిల్...రజనీ అభిమానులకు చేదు వార్త


సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు 'కబాలి' యూనిట్ చేదు వార్త వినిపించింది. 'కబాలి' ఆడియో వేడుక ఎప్పుడెప్పుడా అంటూ ఆసక్తిగా ఎదురు చూసిన రజనీ అభిమానులకు షాకునిస్తూ...ఆడియో వేడుక క్యాన్సిల్ అయిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నెల 12న ఆడియో వేడుక నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది, అయితే, రజనీకాంత్ ప్రస్తుతం అమెరికాలో ఉండడంతో, ఆడియో వేడుకను రద్దు చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. దీంతో ఆడియోను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. జూలై 1న 'కబాలి' చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News