: కొడంగ‌ల్ ప్ర‌జ‌ల‌కు రేవంత్ శ‌ని లాంటి వాడు: మ‌ంత్రి జూప‌ల్లి


తెలంగాణ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈరోజు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ప‌ర్య‌టించిన ఆయ‌న జొన్నలబవడ ప్రాంతంలోని కల్వకుర్తి రెండో లిఫ్ట్ పనులపై ఆరా తీశారు. అనంత‌రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి త‌నకిష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని అన్నారు. రేవంత్ రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పాల‌మూరు లిఫ్ట్‌ను అడ్డుకుంటే ప్ర‌జ‌లు చూస్తూ ఊరుకోర‌ని జూపల్లి అన్నారు. కొడంగ‌ల్ ప్ర‌జ‌ల‌కు రేవంత్ శ‌ని లాంటి వాడ‌ని ఆయ‌న అన్నారు. పాలమూరు ప్రాజెక్టులపై కాంగ్రెస్, టీడీపీలకు మాట్లాడే అర్హత లేదని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రాజెక్టులు పూర్తై శ్రీశైలం రిజర్వాయర్‌లో నీళ్లు రాగానే అక్కడి అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌ కొల్లాపూర్‌ ప్రాంతాలకు నీళ్లు అందుతాయని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News