: ఎంతో దయాగుణమున్న మా అమ్మపై నిందలేస్తారా?: రేణుకా చౌదరి కూతురు


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి కుటుంబం ఇటీవల ఒక రెస్టారెంట్ కు వెళ్లటం, వాళ్ల పనమ్మాయిని పక్కనే నిలబెట్టి, వీరంతా భోజనం చేయడం.. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడం, నెటిజన్లు విమర్శలు కురిపించడం తెలిసిందే. అయితే, నెటిజన్ల వ్యాఖ్యలపై రేణుకా చౌదరి కూతురు తేజశ్విని స్పందించారు. వాస్తవాలు తెలుసుకోకుండా, సగం ఫొటో చూసి విమర్శలు చేయడం తగదని పేర్కొంది. పనమ్మాయిని తన కోసమే నియమించారని, ఆ పనిమనిషి బాలిక కాదని, ఆమె వయస్సు 26 ఏళ్లని, ఇద్దరు పిల్లలు కూడా ఆమెకు ఉన్నారని తేజశ్విని పేర్కొంది. తమతో పాటే ఆమె కూడా భోజనం చేసిందని చెప్పుకొచ్చింది. ఎంతో దయాగుణం కల్గిన తన అమ్మపై నిందలు వేయడం సబబు కాదని, ఆమె ద్వారా ఎంతో మంది సహాయం పొందారని, వారందరికీ సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు లేవని, ఉంటే కనుక ఈ విషయాలన్నీ తెలిసేవని తేజశ్విని తన తల్లిపై ప్రశంసల వర్షం కురిపించింది.

  • Loading...

More Telugu News