: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమితాబ్ మనవరాలి వీడియో


నవ్య నైవేలీ నందా...గత కొంత కాలంగా బాలీవుడ్, పేజ్ 3 సర్కిల్ లో హల్ చల్ చేస్తున్న పేరు. అమితాబ్ బచ్చన్ కుమార్తె శ్వేత బచ్చన్ నందా కుమార్తె అయిన నవ్య నైవేలీ నందా ఈ మధ్యే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ లో ఉండగా, షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో రొమాన్స్ చేస్తోందంటూ వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. తరువాత ఇంగ్లండ్ కు చెందిన యువకుడి ఒళ్లో కూర్చున్న ఫోటోలు ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేయడంతో మరోసారి దుమారం రేగింది. ఈసారి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా థాయ్ లాండ్ లోని పుకెట్ దీవుల్లో స్నేహితులతో కలసి పార్టీ చేసుకున్న నవ్య టూపీస్ బికినీలో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నవ్యకు ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలా వ్యవహరించాలన్న విషయాలు ఎవరూ నేర్పించాల్సిన అవసరం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, అమితాబ్ ఎలా స్పందిస్తారో చూడాలంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News