: చంద్రబాబును జగన్ విమర్శించినప్పుడల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఒకరు జంప్ అవుతున్నారు: జలీల్ ఖాన్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మరోమారు విమర్శలు గుప్పించారు. తమ అధినేత చంద్రబాబును జగన్ విమర్శించిన ప్రతిసారి, ఆ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే తమ పార్టీలోకి వస్తున్నారని, త్వరలో పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి తమ పార్టీలోకి రానున్నారని చెప్పారు. చంద్రబాబును, టీడీపీని అదేపనిగా విమర్శిస్తున్న వైఎస్ జగన్ ని, ఆ పార్టీ నేతలను ప్రజలు గమనిస్తున్నారని, వారికి తగిన బుద్ధి చెబుతారని జలీల్ ఖాన్ అన్నారు. కాగా, పలమనేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి టీడీపీలో చేరితే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనే విషయమై తన అనుచరులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.