: బీహార్‌లో 'టాపర్ల' కేసులో తొలి ముగ్గురు టాపర్లపై కేసులు
ఇటీవల బీహార్ సెకండరీ గ్రేడ్ ఎడ్యుకేషన్ బోర్డ్ పరీక్షల్లో టాప్ ర్యాంకుల్లో నిలిచిన విద్యార్థులు చిన్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోయిన విషయం తెలిసిందే. ఈ అంశం వెలుగులోకి వచ్చిన అనంతరం అధికారులు సదరు విద్యార్థులకి మళ్లీ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు ఈసారి నిర్వహించిన పరీక్షలో ఏ మాత్రం ప్రతిభ కనబర్చలేదు. దీంతో ఈ అంశంపై స్పందించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ వ్యవహారంలో నిందితులందరినీ అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. నితీశ్ ఆదేశాలతో పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ముగ్గురు టాపర్లపై ఈరోజు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ అంశంపై పరీక్ష నిర్వహించిన అధికారులను పోలీసులు విచారిస్తున్నారు. నిందితులపై వేగంగా విచారణ జరిపి దోషులుగా తేలిన అందర్నీ కఠినంగా శిక్షించాలని నితీశ్ కుమార్ ఆదేశించారు.