: ముంబై దాడుల్లో దోషి 'పాక్' అని తేల్చిన చైనా అధికారిక టీవీ ఛానెల్


ముంబై దాడుల దోషి పాకిస్థాన్ అని, దాడుల సూత్రధారి మసూద్ అజార్ ఆ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని భారత్ పలు సందర్భాల్లో తేల్చిచెప్పింది. ఇప్పటి వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోని పాకిస్థాన్, అతనిని నిర్బంధంలోకి తీసుకున్నామని, విచారణ జరుపుతున్నామని చెబుతూ వస్తోంది. తాజాగా ముంబై దాడుల ఘటనపై చైనా అధికారిక టీవీ ఛానెల్ సీసీటీవీ9 ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా, దానికి నిధులు సమకూర్చే వారిపై రూపొందించిన ఈ కథనంలో ముంబై దాడుల ఘటనను సవివరంగా ప్రస్తావించింది. ఈ దాడులకు పాల్పడింది పాక్ లోని లష్కరే తోయిబా సహకారంతో నడిచే జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థేనని స్పష్టం చేసింది. తాజా కథనం ప్రసారంతో పాక్ కు సాయంపై చైనా పునరాలోచనలో పడిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ ను అణచివేయాలన్న లక్ష్యంతో పాకిస్థాన్ లో వేలకోట్ల రూపాయల విలువైన వివిధ అంతర్జాతీయ ప్రాజెక్టులను చైనా ఉచితంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News